Thursday, March 8, 2012

మార్చ్ 8వ తేదీ రోజు నమస్తే తెలంగాణ, సూర్యలో నా వ్యాసాలు

 
 
సూర్యలో  ......................
మహిళా బిల్లును మరిచామా?
david
భారతదేశ పార్లమెంట్‌ చరిత్రలో మెజారిటీ ఉండికూడా చట్టంగా రూపుదాల్చని వాటిలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఒకటి. దేశంలో ఏకాభిప్రాయం లేని కారణంగా ఇది ఎన్నో సంవత్సరాలనుండి పార్లమెంట్‌లో చట్టంగా రూపుదాల్చలేక పోతోంది. ప్రస్తుత ప్రభుత్వమైనా తన ప్రభుత్వ పదవీకాలం ముగిసే లోపు ఇది చట్టరూపం దాల్చేలా కృషిచేసేందుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అం దరూ దీక్ష పూనాల్సిన అవసరం ఉన్నది.

అన్ని వివక్షల్లో కెల్లా స్త్రీ వివక్ష చాలా ప్రమాదకరమైనది. సమాజంలోని లింగవివక్షను రూపుమాపి మహిళల సాధికారికతకు దోహదం చేయాలంటే మహిళా రిజర్వేషన్‌లు తప్పనిసరి. నేటి సమాజంలో మహళా సాధికారికతకు దోహదం చేసే ప్రభుత్వ పథకాలన్నీ సమర్ధవంతంగా అమలు జరగాలంటే ఆ పథకాల నిర్మాణంలో, అమలులో వారి భాగస్వామ్యం తప్పనిసరి. తద్వారా మహిళా సాధికారికత సాధించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా మహిళలు స్వావలంభన పొందగలుగు తారు. అదే విధంగా ప్రభుత్వ విధానాలను మహిళలకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తారు. అందువల్ల ప్రభుత్వ విధానాల తయారీలో మహిళల భాగస్వామ్యం పెంచాలంటే వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి.

అత్యధిక సంఖ్యలో ప్రజలకు రాజకీయ పాలనలో భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం. అయితే సమాజంలో దాదాపు సగం వరకు మహిళలకు రాజ కీయ పాలనలో, ప్రభుత్వ విధానాల నిర్మాణంలో వారికి సరియైన ప్రాతినిధ్యం లభించుట లేదు. దేశ జనాభాలో 50 శాతాన్ని ఆక్రమించిన మహిళలు రాజ కీయ పదవులలో ఎన్నడూ 8.4 శాతానికి మించిలేరు. కాని ప్రపంచ దేశాలలో చాలా దేశాలు మహిళలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడంలో భారతదేశం కంటే ముందువరుసలో ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌, దక్షిణ ఆఫ్రికా దేశాలలో మొత్తం మహిళలలో 30శాతం నుండి 35 శాతం మంది అక్కడి పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన పొరుగు దేశం పాకిస్థా న్‌లోసైతం దాదాపు 23 శాతం మంది మహిళలు పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. మొత్తంమీద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 శాతం మంది మహిళలు పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన దేశంలో ప్రపంచ సగటుకన్నా తక్కువగా 8.4 శాతం మాత్రమే మహిళలు భాగస్వామ్యం వహిస్తు న్నారు. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని మరింతగా పరిపుష్ఠం చేయడానికి, సుసంపన్నం చేయడానికి మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్‌లను కల్పించడం తప్పనిసరి.

అభివృద్ధి అజెండాను మార్చేందుకు మహిళా రిజర్వేషన్‌ చాలా అవసరం. నేడు ఆర్ధికాభివృద్ధిలో భారతదేశం పురోగమిస్తోంది. కాని మానవాభివృద్ది నివేది కలో ఇప్పటికే చాలా వెనకబడి ఉన్నాము. ప్రభుత్వ పాలనలో మహిళల భాగస్వా మ్యం పెరిగితే ప్రభుత్వ విధానాల్లో మానవాభివృద్ధి ప్రధాన అజెండాగా వస్తుంది. ఎందుకంటే మానవాభివృద్ధి సూచిక అంశాలలో మహిళలకు కల్పించే సౌకర్యాలని కూడా ఒక అంశంగా పరిగణిస్తారు. మంచినీటి వసతి, పిల్లల ఆరోగ్య విషయాలు, పౌష్ఠికాహార కల్పనలలో తల్లి ఎక్కువగా కృషిచేస్తుంది. అందువల్ల మహిళలకు ప్రభుత్వపాలనలో భాగస్వామ్యం కల్పించడం వల్ల వారు సమాజానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందించుటకు అవకాశం ఉంటుది.నేటి నేరపూరిత, అవినీతి పూరిత రాజకీయాల్ని తగ్గించేందుకు కూడా రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం దోహదం చేసి, రాజకీయ ప్రక్షాళాన జరిపేందుకు అవకాశం ఉంది. కాని గత 50 ఏళ్ల పార్లమెంట్‌ చరిత్రలో ఏ రాజకీయపార్టీ స్వచ్ఛందంగా మహిళలకు ప్రాధాన్యతఇచ్చి వారిని ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగస్వాములను చేయుటకు ముందుకు రాలేదు. సంకీర్ణ రాజకీయాలలో ప్రతి సీటు చాలా ప్రాముఖ్యత వహించిందని, అందువల్ల ఎక్కువ సీట్లను మహిళలకు కేటాయించడం లేదని అన్ని పార్టీలూ సమర్ధించుకుంటున్నాయి. అయితే పరోక్ష ఎన్నికలకు అవకాశం ఉన్న శాసన మండలి, రాజ్యసభ సీట్లలో కూడా స్ర్తీలకు తగిన అవకాశాలను కల్పించడంలో రాజకీయపక్షాలు వెనకాడుతున్నాయి.

మహిళా రిజర్వేషన్‌లపై ప్రధాన అభ్యంతరం ఏమిటంటే- అగ్రకులాలకు చెం దిన మహిళలే అధింగా లాభపడి, సామాజికంగా వెనుకబడిన వర్గాల మహి ళలకు అన్యాయం జరుగుతూ చట్టసభల సామాజిక పొందిక దెబ్బతింటుంద నేది. అగ్రకులాల మహిళలతో వెనకబడిన కులాలకి చెందిన మహిళలు పోటిప డలేరు. ఈ అభ్యంతరం వల్లనే మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చలేక పోతోంది. దీనిని పరిశీలిస్తే ఇది న్యాయమైన వాదనగా అర్ధమవుతుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేసినట్లయితే వాస్తవానికి సామాజికంగా వెనకబడిన వర్గాలకు సరియైన ప్రాతినిధ్యం లభించకపోవచ్చు. లింగవివక్షతను అధిగమిం చాలంటే ఉప కోటాతో సహా మహిళారిజరేషన్‌ బిల్లు అమలుపరచడం అవసరం. అయితే ప్రస్తుతంఉన్న రూపంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు పరచడం వల్ల వెనకబడిన వర్గాల మహిళలకు నష్టం కలుగుతుంది.

భారతదేశంలో కులం ఒక బలమైన వ్యవస్థ. ఇది దేశరాజకీయాల్ని నిర్దేశిం చగలుగుతోంది. రాజకీయ సమీకరణకు కులం ఒక ప్రాతిపాదిక. మండల్‌ కమిషన్‌ సిఫార్స్‌ల అనంతరం దేశరాజకీయాలల్లో సామాజికా మధనం ప్రారంభమైంది. దీని ప్రకారం దేశరాజకీయాలలో వెనకబడిన వర్గాలకు చెందిన వారి రాజకీయ ప్రాబల్యం పెరిగింది. మహిళా రిజర్వేషన్‌లను ప్రవేశపెట్టి ఉప కోటా అమలుచేయవచ్చు. ప్రస్తుత రూపంలో మహిళా రిజర్వేషన్‌లు పూర్తిగా పలుకుబడి గలవారికే ఉపయోగప డతాయి. దక్షిణాసియా దేశాలలో మహిళలలో ఎక్కువమంది పలుకుబడి కలిగిన వర్గాలనుండివచ్చి రాణించినవారే అధికం. రాజ్యాంగం స్థానిక సంస్థలలో 33 శాతం సీట్లను స్త్రీలకు కేటాయించడం ద్వారా నేడు సుమారు 10 లక్షలమంది మహిళలు పాలనలో పాల్లోనే అవకాశంవచ్చింది.

వారిలో ఎందరో జడ్పీటీసీలు గా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, సర్పంచ్‌లుగాపనిచేస్తున్నారు. వీరు కూడా తమకు అవకాశాలు వస్తే రాజకీయ రంగంలో అద్భుతాలు చేయగలమని నిరూ పించారు. కాబట్టి మహిళలను నైపుణ్యం లేనివారని తక్కుగా అంచన వేయడం సరియైనదికాదు. ప్రతి రాజకీయపార్టీ మహిళా రిజర్వేషన్‌ చట్టం రూపం దాల్చేందుకు పురుష్యాధిక్యతను పక్కకుపెట్టి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.

Tuesday, February 14, 2012

ప్రేమ

ప్రేమంటే పెదాలు పలికే పదాలు కావు
పెదాలు సైతం పలకలేని భావాలు 

Saturday, December 31, 2011

నూతన సంవత్సర శుభాకాంక్షలు..


ఆమని పిలిచే వేళా...
కోయిల పాడే వేళా...
వసంతం పల్లవించే వేళా...
ప్రకృతి ఎంత కమనీయం...రమనీయం...
చూసే హృదయం ఆనందమయం....
ఆ ఆనంధమే మీ జీవితంలో సాగాలని కోరుకుంటూ...
నూతన సంవత్సర శూభాకాంక్షలు....

Tuesday, December 6, 2011

"ఇరోం షర్మిలా" దీక్షకు 12 ఏండ్లు




ఉక్కు సంకల్పం ఆమె. మొక్కవోని మనో నిబ్బరం ఆమె. అత్మరవం నుంచి జనించిన ఆగ్రహం ఆమె. తల్లడిల్లుతున్న యుద్ధభుమిలో తపోదీక్ష చేస్తున్న శాంతికపోతం ఆమె. తుపాకి గొట్టాల విచ్చలవిడీ తనాన్ని ప్రశ్నించిన ప్రజాస్వామిక గొంతు. నిరంకుశ చట్టాన్ని  నిరసించిన నిప్పు కణిక. జాతికోసం జంగ్ చేస్తున్న జ్వలిత. అన్యాయంపై తిరగబడ్డ అగ్గిబరాట. శరీరాన్నే ఆయుధంగా మలుచుకున్న సాహస వనిత. పుష్కర కాలంగా అన్నపానియాలు ముట్టని అసలు సిసలు సత్యాగ్రహి. కన్నీల్లను, కష్టాలను కలబోసిన నెత్తుటి గేయం ఆమె దీక్ష. మరుభుమిగా మారిన మాతృ భుమి గాయాలను మాంపేందుకు తనుఫు, మనసును ఏకం చేసి సందించిన దీక్ష పేరు ఇరోం చాను షర్మిలా.

నవంబర్ 2, 2000 సంవత్సరం మణిపాల్ లోయలోని మలోం బస్టాండ్ల్ లో అస్సాం  రైఫిల్స్ విచక్షణా రహితంగా గర్జించింది. పదిమంది. అమాయకులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మలోం నరమేధం, సాయిధ దళాల పద ఘటనలో దశాబ్దాలుగా నలిగిపోతున్న మణిపూర్ ఒక విషాద ఘట్టం.  సాయుధ దళ కౄరత్వం  అందరిని కలచివేసింది. ఇరోం షర్మిలా స్థానిక పత్రికలో జర్నలిస్టు. కవయిత్రీ కూడా. కనికరం లేని తీరుతో కలతచెందిన షర్మిలా కటిన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఆమరణ దీక్షకు దిగింది. యమపాశంగా మారిన భద్రత దళాల ప్రత్యేక అధికారల చట్టం అంతు చూసేదాకా దీక్ష సాగిస్తానని శపధం చేసింది. తన చావుతోనైనా తన జాతికి పట్టిన పీడనను వొదిలించాలని పట్టుదలతో దీక్ష చేపట్టింది. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు షర్మిలాను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏంత బలవంతం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో నాసోగ్యాస్ట్రిక్ ఇన్ ట్యుబ్యెషన్ పద్దతిలో ముక్కుద్వారా ద్రవ పదార్థాలను పంపించడం మొదలు పెట్టారు. షర్మిలా బైల్ తీసుకోవడాంకి నిరాకరించింది. ఆత్మహత్య నేరం కింద జైలు శిక్ష సంవత్సరం మాత్రమే కాని ఏడాది కాగానే జైలు నుంచి విడుదల చెయడం మళ్ళీ అరెస్టు చేయడం.. 12 ఏండ్లుగా మణిపూర్ పోలిసులు అదే పని చేస్తున్నారు. ఇప్పటికే 500 సార్లు కోర్టు, జైలు, హాస్పిటల్ వార్డుకు తిరిగించి. 12 ఏండ్లుగా షర్మిలా నోటిద్వారా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ముక్కుద్వారా పైపుతో ప్లూయిడ్ ఎక్కించడం నిజంగా ఒక హింస. షర్మిలా శరీరం రోజురోజుకు కుషికంచిపోతుంది. అవయవాలు మెళ్ళగా దెబ్బతింటున్నాయి. 38 ఏళ్ళ షర్మిలా బరువు ఇప్పుడు 37 కిలోలు. 2006లో విడుదలైనప్పుడు. షర్మిలా ఢిల్లీ రాజ్ఘడ్ చేరుకోని మహాత్ముడికి మొరపెట్టుకుంది. జంతర్ మంతర్ వద్ద దీక్ష సాగించింది. కేంద్రం వెంటనే అరెస్టు చేసి ఆసుపత్రిలో నిర్భందించింది. తరువాత  ఇంఫాల్ కు తరలించింది. సంచలన వార్తల గుంపులో కొట్టుకుపోతున్న జాతీయ మీడియాకు షర్మిలా దీక్ష వార్త కాదు. అసలే గుర్తింపుకు నోచుకోని ఈశాన్య రాష్ట్రాలు. పైగా కనీస కవరేజ్ ఇవ్వని మీడియా.  సంవత్సరాలు గడుస్తున్న కదలిక లేని తోలు మందం ప్రభుత్వం. శారీరక బహహీనత, మానసిక సంఘర్షణ చుట్టూ తుపాకులు.  ఐతే హాస్పిటల్ లేదంటే జైల్. కత్తుల వంతేనమీద పయనం. ఆటు కానరానీ పరిష్కారం.  ఐతేనేం ఆమె మానసిక దృడత్వం ముందు ఏ అవంతరాలు నిలువలేదు. ఆమె సంకల్ప బలం ముందు నిరాశ, నిశ్పృహలు వెలవలేదు. నిబద్ధత, నిజాయితి, తన జాతి జనుల పట్ల ప్రేమ, అమానవీయ చట్టాలను ఆంతం చేయాలన్న కర్తవ్యం. అమెను ముందుకు నడిపించాయి. మొన్న నవంబర్ 4వ తారీకుతో ఆమె దీక్ష 12 వ ఏడాదిలో ప్రవేశించింది. పుష్కర కాలంగా అదే సహసం అదే సహనం. 12 ఏండ్లుగా పుస్తకాలు, కవితలే ఆమె నేస్తాలు. ఈ ప్రస్తానంలో ఒక ఇంట్రెస్టింగ్ యాంగ్ల్ షర్మిలా లవ్ స్టోరీ.. షర్మిలా దీక్ష కాలంలోనే ప్రేమలో పడింది. అతని పేరు డెస్మాండో  కొటినో. బ్రిటన్ లో పుట్టిన భారతీయుడు .  మానవ హక్కుల కార్యకర్త. మరి పెండ్లెప్పుడు అని అడిగితే. సైనిక చట్టం రద్దై  , శిక్ష ముగిశాక అని చెప్పేసింది  ఆ వనిత సాహస దీక్షకు ఏన్నో అవార్డులు వచాయి. ఎషియన్ హుమన్ రైట్స్ ఫోక్ స్కూల్ మానవ హక్కుల పురస్కారం 2007 లభించింది. కాని మన ప్రభుత్వం కనికరించలేదు. సెవెన్ సిస్టర్స్ లో ఒకటైన మణిపూర్ సిస్టర్ కన్నీళ్ళను తుడవడానికి చేయి రాలేదు. నామమాత్రంగా ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. అన్నా హాజారే దీక్ష, మీడియా హడావుడి, విమర్శలు, చర్చల నేపథ్యంలో ఎక్కడో మూలన పడిపొయిన షర్మీలాది ఇప్పటికి ఒక వార్తగా మెయిన్ స్ట్రీం మీడియాకు ఎక్కింది. దేశ వ్యాప్త చర్చకు నోచుకున్నది. షర్మిలా  దీక్షా, లక్ష్యం పైనా ఫొకస్ పెరిగించి. ఇప్పుడు ప్రశ్న ఈ దీక్ష ఇంకెంత కాలం సాగుతున్నదన్నది కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇంకెన్నాలు ఉలుకూ పలుకూ లేకుండా కుర్చుంటాయన్నదే ప్రశ్న. ఒక మహిళ గాంధీ  మార్గంలో సాగిస్తున్న సత్యాగ్రహం పాలకులను  కదిలించ్లేకపోవడం మహా విశాదం.  ప్రజాస్వామ్యంలో పెద్ద విఘాతం.  షర్మిలా హిమాలయమంత ఎత్తున ఎదిగిన ఉద్యమ మూర్తి.  అన్యాయాన్ని ఎదిరించి నిపుస్తున్న వాళ్ళకు కొండంత స్పూర్తి . ఆమె నుండి ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన విలువైన పాటాలు ఏన్నో. నలుగురి కోసం బతకడం. నలుగురి కోసం చావడానికి సిద్దపడటం ఈ భూమ్మీద  అదే అంతటా ఆదర్శం. ఆ ఆదర్శాన్ని అంతటా ఆవిష్కరించిన షర్మిలాజి రెండు చేతులెత్తి చేయాలి వందనం.

Saturday, November 26, 2011

అమ్మ నిన్ను కన్నందుకు వందనాలు


విప్లవాలు, సాయుధపోరాటాలు తెలుగు నేలకి కొత్తకాదు. నాగలిపట్టె రైతన్న తుపాకి పట్టాలంటూ 60 ఏళ్ళ క్రితం మొదలైన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం అగిపోయినా, చారుమజుందారు పిలుపునందుకోని తిరిగి అటు శ్రికాకుళంలో ఇటు తెలంగాణలో మళ్ళీ ఉద్యమాలు చెలరేగాయి. నిండు యవ్వన ప్రాయంలో ఈ ఉద్యమంలో దూకి గత ముడున్నర దశాబ్దాలుగా నేలకొరిగిన యువత ఐదు వేలకుపైచిలుకన్నది ఒక అంచనా. కేవలం 20ల సగటు వయసులో సామాజానికి చోదక శక్తి కావలసిన యువతను నష్టపోవడం ఆ సమాజానికే ఒక నష్టం ఐతే వారిని కన్న తల్లులకు అది తీరని గర్భశోకం. రాజకీయాలు తెలియకపోయినా, రహస్య జీవితంలో కన్న బిడ్డ భద్రతకోసం ఆరాటం, వాళ్ళ ఆచూకి కోసం నిర్భందం ఒకే సారి అనుభవించే తల్లులకు వారి మరణవార్త ఆశనిపాతం. ఒక గొప్ప ఆదర్షం కొసం, తను నమ్మిన సిద్దంతం కొసం బంధాలను, అనుబంధాలను వదులుకొని తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా వదులుకున్న బిడ్డలు గత మూడున్నర దశాబ్దాలుగా ఈ దేశంలో ఏందరో. అటువంటి అరుదైన వ్యక్తే మల్లొజుల కోటేశ్వర రావ్ ఉరఫ్ కిషన్ జీ. విప్లవాన్ని ఊపిరిగా మలుచుకున్న మనిషి, విప్లవ గడ్డ, పోరుగడ్డ కరీం నగర్ జిలాలో పుట్టి ఎక్కడైతే నక్సల్బరి పురుడుపోసుకుందో అక్కడనే నాయకుడిగా ఎదిగి, ప్రజలలో ఒదిగి కర్కష ప్రభుత్వాల పన్నాగాలకు బలీఇపోయిన వ్యక్తి కిషన్ జీ    

ఆయనెవరో నేటి తరానికి తెలియకపోవచ్చు. ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ కోసం బలి అయిన రోజులు. ఉద్యమాన్ని రాజ్యం కృరంగా అణచివేస్తూ, న్యాయం అడిగిన యువకెరటాలను పిట్టల్లా కాల్చివేస్తూ ఉంటే ఏదో ఒకటి చేయాలని యువత తపన పడుతున్న రోజు;లవి. ఇటు రాజకీయాల ద్వారా రాని తెలంగాణ, ఏన్నో ఒప్పందాల ద్వారా అందని న్యాయం. ఎన్నో వలసలు, వనరుల విధ్వంసం, సాంసృతిక హింస, మానసికంగా అవమానం. అత్మగౌరవనికి అన్యాయం జరుగుతుంటే ఆపలేని నిరాసక్తత. అప్పుడే కొత్తగా గాలులూ వీస్తూ, ప్రజాపోరాటాలకు నాంది పలుకుతున్న కొత్త రాజకీయాలు. న్యాయం, ధర్మం అడుక్కుతింటే రావని, ప్రశాంత వాతావరణంలో రాజ్యానికి ఎటువంటి నష్తం కలగకుండా పోరాటాలు చేస్తే తమ ప్రాణాలకు ముప్పే కాని దోపిడీ దారులకు కాదని తెలుసుకున్న రోజులవి. అటువంటి వాతావరణంలో గ్రామాలకి తరలండి అన్న పిలుపునందుకున్న కిషన్ జీ ప్రత్యమ్నాయా రాజకీయాలవైపు దృష్టి సారించి భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించాడు. పుట్టింది అగ్రకులాలో ఐనా అందరికి సమన్యాయం అందలనె సిద్ధంతాన్ని నన్ని సబ్బండ కులాలవైపు నిలబడ్డడు. భారత రాజకీయాలల్లో కేవలం కొన్ని వర్గాల వారికి మత్రమే న్యాయం చేకురుతుందని, అధికార దాహం పేద, దళిత, ఆదివాసి ప్రజలని అణిచివేస్తున్నాయని వాటిని ప్రశ్నించేందుకు ఒక ప్రత్యమ్నాయ పోరాట రూపం ఎన్నుకోవడమే ఆయన చేసిన నేరం. ఈ దేశంలో ప్రత్యమ్నాయ రాజకీయాలకు ఒక రంగు ఉంటుంది.  ఒక బ్రాండ్ ఉంటుంది. ఒక పోరాట రూపం ఉంటుంది. సాయుధ పోరాటం, పీపుల్స్ వార్, నక్సలైట్, మావోయిస్టు ఇవన్ని వినకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడినవాడు కరడుగట్టిన రక్తపిపాసి, మనుషులను ఖండ ఖండాలుగా నరికే కసాయివాడు. ఇది రాజ్యం. రాజ్యానికి కొమ్ము కాసే పార్లమెంటరిదారులు వాడే భాష.            

ఇది బూటకపు ఎన్ కౌటర్ల దేశం. ఈ దేశంలో ఆజాదులను వెంటాడి వెంటాడి చంపుతారు. కారణం వారు నక్సలైట్లు.   హేమచంద్రపాండేను చంపుతారు కారణం ఆయన ఒక జర్నలిస్టు.  ఎందుకంటే ఆయన ఈ వ్యవస్థను ప్రశ్నించాడు. ప్రజలపై జరుగుతున్న హింసను తన కలంతో అక్షర రూపం ఇచ్చాడు కాబట్టి. ఆయనకు ప్రత్యామ్నాయ రాజకీయాలతో సంభందాలు ఉంటాయి కాబట్టి. ఆయన ఇంట్లో నిషిద్ద సాహిత్యం ఉంటుంది కాబట్తి. పొరపాటు పడవద్దు. బూతు సాహిత్యం గురించి కాదు మనం మాట్లాడుతుంది. మార్పును కోరే సాహిత్యం గురించి మాత్రమే. కొన్ని నెలల తర్వాత సుప్రీంకోర్టు ఇది అన్యాయం అంటుంది. అది ఏ పత్రికా రాయదు. రాసినా వాటి గురించి పెద్దగా చర్చ జరగదు. గుజరాత్ లో మోడి ప్రభుత్వం కూడా ఇజ్రత్ జహాన్ నీ మరో ముగ్గురిని ఎన్ కౌటర్ చేస్తుంది. ఉగ్రగాదులు అని వారిపై ముద్ర వేస్తుంది. జాని కొన్ని నెలల తర్వాత ఇవే కోర్టులు వారిది బూటకపు ఎన్ కౌటర్ అంటుంది. షీలాశూద్ అనే సామాజిక కార్యకర్త హక్కును అడిగిన పాపానికి హత్య కావించబడుతుంది. ఐనా ఏ వ్యక్త్తి ప్రశ్నించడు. ఏ పత్రికా పెద్ద వార్తగా వ్రాయదు.  పాటలు పాడుకుంటూ, ఇది దోపిడి రాజ్యం, దోంగల రాజ్యం అని తన కళారూపంతో ప్రజలను చైతన్య పరుస్తున్నందుకు జీతెన్ మారాండికి ఉరిశిక్ష. ఇక్కడ వాళ్ళు రాసుకున్న రాజ్యాంగాన్ని, న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, ఎక్కడ పడితే అక్కడ, ఎవ్వరిని పడితే వారిని పట్టుకోని అన్యాయంగా చంపోచ్చు. వారికి మావోయిస్టు అని పేరు పెట్టొచ్చు. నీ చేతిలో తూపాకి ఉంటే దేశ రక్షణ. నాచేతిలో తూపాకి ఉంటే నేనొక నిషిద్దం. అభివృద్ది అనే ముసుగులో ఆదివాసులను. అడవులను, బీదప్రజలను దేశ సార్వభౌమత్వాన్ని కార్పోరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న రాజకీయా పార్టీలను  ఎదిరించకూడదు.  దీనిని ఎవడైనా ప్రశ్నిస్తే వాడు నిషేదిత సంస్థకు చెందిన వ్యక్తి. ఇది దేశ, రాజ్య, ప్రపంచ సూత్రం.         

Friday, August 19, 2011

నా పెళ్ళి ముచ్చట్లు




Thursday, June 23, 2011

జీవితం

జీవితం గాయపరచవచ్చు
దగా చేసిండవచ్చు
దౌర్జన్యమే జరిగి ఉండోచ్చు
ఏం జరిగినా నువ్వు ఒంటరిదానివి కాదుగా 
ఎందుకలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయావు?
చేయిపట్టుకు నడపాల్సిన పిల్లల్ని,
గుండేల్లో దాచుకోవాల్సిన సహచరుల్ని
వదిలి ఎట్లా వెళ్ళాలనిపించింది? 


ఒంటరిగా వెళ్ళాననుకున్నావేమో
నీ ప్రాణ సమానుల్ని,
సహచరుల్ని,
చేయిపట్టుకు నడిపించాల్సిన పిల్లల్ని,
గుండేల్లో దాచుకోవాల్సిన వాళ్ళని,
వాళ్ళ జీవితాన్ని,
వాళ్ళ ఆశల్ని కూడా నీ వెంట తేసుకెళ్ళిపోయావు..


చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు
ఎప్పుడైనా తిరిగొస్తారని
హృదయంతో వేచిచూసే వాళ్ళు గుర్తుకు రాలేదా నీకు?
ఒక్క తీపి జ్ఞాపకం ఐనా  నిన్ను కదలించలేదా?
ఆనాటి ఆత్మీయత నిన్ను కరిగించలేదా నేస్తం?   

Thursday, March 24, 2011

ప్లీజ్ చేప్పవా?

కొన్ని సందర్భలాలలో అంటుంటారు
కాలం అగిపోయిందని...
కాలం స్థంబించిపోయిందని,
పిచ్చిగాని కాలం అగిపోతుందా ఎక్కడైనా?
నిరంతరం, నిరంతారాయం దాని పయనం.


అదేమోగాని మనసు స్థంబించిపోదు అప్పుడప్పుడు
నిజం చేప్పు?మనసు అగిపోవడం నికూ ఎప్పుడు జరగలేదూ?
మది చెదిరి,మనసు వికలమైనప్పుడు..
దుఖం హిమాలయంలా పెరిగిపోతున్నప్పుడు,
బాధా లేక, బాధ్యత లేక
నిర్వేదంగా,నిరాసక్తంగా
పులుస్టాప్ లా మనసాగిపోతే దాన్నేమంటారు?


శరీర బాగాలన్ని పనిచేస్తూ మెదడు పనిచేయకపోతే "కోమా" అని.
మెదడు పనిచేస్తూ మిగిలిన బాగాలు పనిచేయకపోతే "క్లీనికల్ డేత్" అంటారు.
మరి మనసు ఏ అలోచన చేయలేక
ఒకే ఒక బిందువు దగ్గర అగిపో
మనోపరిబాషలో దాన్నేమంటారు ప్లీజ్ చేప్పవా?

Saturday, March 19, 2011

exellent poetic dialogue

చాలా రోజుల తర్వాత ఇద్దరు అనే ఒక సినిమా చూశాను. తమిళనాడు రాజకీయాల నేపథ్యంలో తిసిన సినిమా ఇది. ఆ సినిమాలో ప్రకాశ్ రాజ్,మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. ఆ సినిమాలోని పదునైనా డైలాగ్స్ చాలా ఉన్నాయి  అందులో నాకు నచిన డైలాగ్...ఈ కింది  ఆ వీడియో...మీరూ చూడండి .ఒక్క నిమిషం...అన్నట్టు మీకు ఈ డైలాగ్స్ లో కొంత భాగం నచ్చక పోతే వదిలైయండి నన్ను తిట్టుకోకండే ప్లీజ్...   

తామర పూవంటి ముఖం చేసి
చందన పూవంటి తనువు చేసి
విరజాజి పూల పలువరుస చేసి
వెలగ పూవంటి వీనులు చేసి
పూవులతో నీకు అంగములు చేసిన వాడు రాతితో నేలనే మనసు చేసాడు.

నిండు వెన్నెల నేనాశించా
అమావాష్యను నాకందించావు
స్వేచ్చ నేనాశించా
శరనునాకందించావు
రాగం నేనాశించా
మౌనం నాకందించావు
ప్రేమామౄతం నేనాశించా
కన్నిటి కడలి నాకందించావు
వెన్నెలాంటి మనసు నేనాశించా
నిర్ధయతో ముల్లు నాకందించావు

వెన్నెల వెడలు వలపు కొరకు నిరీక్షించా
నువ్వు నిద్రావస్తలోకి జారుకున్నావు
మనసంకితమివ్వ వచ్చాను
నీ గుండెను శిలగా చేసావు
గదితలపులు తెరచి వుంచాను
పిల్ల తెమ్మేరలనెందుకు నిలిపివేసావు
ఇరు చేతులు చాచి నిలిచాను ని హృదయ కవాటం మూసివేశావు
కడలిలో విసిరిన వుక్కు లాగా నా ప్రేమనేలనే విసిరి వేశావు...  

video

Monday, March 14, 2011

ఎలా నేస్తం


చూపుల బాణాలతో మనసుపై దాడి చేద్దామంటే
పువ్వులా నవ్వీ నన్ను కరిగిస్తావు.


నల్ల మబ్బులా వర్షించి కోపంతో నిన్ను ముంచేద్దామంటే
మయూరంలా ఆడి నన్ను కట్టేస్తావు


చీకటి భుతాన్ని చూపించి భయం గుప్పెట్లో నిన్ను పట్టెద్దామంటే
వెలుగుల శికరంపై నిల్చుని పలకరిస్తావు


లోకానికి నిన్ను చూపిద్దామంటే
నాలో నువ్వు లీనమై ఒదిగిపోతావు ఎలా నేస్తం

Monday, March 7, 2011

ఆకాశంలో సగాన్ని...

సమాజం చేక్కిన శిల్పంలోని
కోమలినో,
అబలనో,
సంప్రదాయపు వంటింటి కుందేటినో కాదు,
తాళికి తలవంచిన బొమ్మనో,
ఇంట్లో వంటింటికి,
పడగ్గదికి,
బజారు వ్యాపారానికి సరుకును కాదు,
ప్రేమోన్మాదానికి రాలిపడే సుతారపు కుసుమాన్ని కాదు..
పంచాది నిర్మలను....
ఆకాశంలో సగాన్ని....
అనంత కోటి నక్షత్రాల్లో సగాన్ని....


ఆకాశంలోని సగానికి
"అంతర్జాతీయ మహిళా దినోత్సవ " శూభాకాంక్షలు

Saturday, March 5, 2011

ఆమె...అతను....అందం


ఆమె : ఎంటీ ఆకాశంవైపు అలా చూస్తూన్నావు ఎముందక్కడా?
అతను: ఆటుచూడు ఆకాశం ఎంత అందంగా ఉందో.
ఆమె : అవునా ఏదీ నన్ను చూడనీ...అందంగా ఎక్కడుంది..మాములుగానే ఉందే?
అతను: బాగా చూడూ..
ఆమె : బాగానే చూశాను...అయినా నాకు మాములుగా కనిపిస్తున్న ఆకాశం నీకు ఎలా అందంగా కనిపిస్తూంది?
అతను: ముందు నేను నిన్ను చూసి ఆ తర్వాత ఆకాశాని చూసాను అందుకే నాకు అందంగా కనిపిస్తుంది...నువ్వు నన్ను చూసి ఆకాశాన్ని చూశావు అందుకే నికు మాములుగా కనిపిస్తూంది.

Wednesday, March 2, 2011

మనసేం ఖాళీ లేదు


మనసేం ఖాళీ లేదు...
అవును నిజమే చేబుతున్నా
మనసేం ఖాళీ లేదు
దృశ్యాలలో...భావాలలో ఇరుక్కుపోయి
నిచ్చలత్వం కోల్పోయి
అల్లకల్లోలం చెలరేగే మనసు ఖాళీ ఏం లేదు
ఏవో నీడలు..ఏవో జాడలు
నిలువనివ్వని కదలనివ్వని సంకేళ్ళు
ఖాళీ ఎక్కడుంది..శూన్యంగా ఎప్పుడుంది
వేదనతోనైనా సరే ఈ మనసు నిండేవుంది

Monday, February 28, 2011

బాగానే ఉన్నాను

ఎంత అదృష్టవంతురాలివి నువ్వు

ఎంత సులభంగా నా చేతుల్లోనుంచి జారిపోయావు

నువ్వు లేకపోతే జీవితం లేనేలేదని

నువ్వు లేని కాలాన్ని ఉహించికోనైనా లేని నేను

ఇన్నేళ్ళు అలవోకగా గడిపేశాను

అయినా నేను బాగానే ఉన్నాను



చుట్టురా నా బలగం ఎంత మంది ఉన్నా

ఎవరి ప్రాధాన్యతలు వారివి

ఎవరి వొత్తిళ్ళలో వాళ్ళు ఉన్నపుడు

మెరుపులా స్పురణకు వస్తావు

ఒక్కసారిగా ఆ స్మృతిసీమల్లో తడసి పోతాను

ని స్మృతి నాకు ఆనందాన్నే కాదు

అవదులు లేని భయాన్ని కల్గిస్తూంది

జీవన విధ్వంసాలెన్నింటినో ఎదుర్కోని

కొంచం కొంచం నన్ను నేను కోల్పోతూ బాగానే ఉన్నాను

ఉద్వేగాలని...ఉత్పాతాలని

సంబరాల్ని...వెతల్ని..వెలితిని

పదిలంగా నాలోనే దాచుకుంటూ బాగానే ఉన్నాను.


గడిచిపోయిన కాలం సాక్షిగా..

కరిగిపోయిన కలల సాక్షిగా..

కన్నిటీ సుడుల మధ్య నన్నో కాగితం పడవను చేసి

దాటిపోయినా బంధాల సాక్షిగా..
ఇంకా నేనున్నానని సంబర పడుతూ బాగానే ఉన్నాను..

దిగులు